`నాకు మళ్లీ పక్కా మాస్ పాత్రలు చేయాలని ఉంది.. మళ్లీ ఒకప్పటి చిరులా కనిపిస్తా` అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య ఓ వేదికపై ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ అన్నదే తడవు.. ఇప్పుడు దర్శకులు ఆయనతో మాస్ అండ్ కామెడీ ప్రాజెక్టులు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఓ పక్కా కమర్షియల్ సినిమాకి బీజం పడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి కోసం దర్శకుడు వివి వినాయక్ ఓ మాస్ స్క్రిప్టుని తయారు చేసే పనిలో పడిపోయాడు. నిర్మాత కూడా రెడీ అట.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ పతాకంపై తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవికు, దర్శకుడు వినాయక్ కీ ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చేశారని టాక్. మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమా పూర్తయిన వెంటనే, వినాయక్ సినిమా పట్టాలెక్కుతుంది. 2024 సమ్మర్ కి ముందే వినాయక్ సినిమా స్టార్ట్ అవుతుందట. ఆ తరవాత దర్శకుడు వెంకీ కుడుములతో కూడా మెగాస్టార్ మరో సినిమా చేయబోతున్నారు.
Also Read: మెగా వారసురాలిని చూశారా..?
ఈ సినిమా కూడా వచ్చే ఏడాదే ఉంటుందని టాక్. వచ్చే యేడాది సరిగ్గా ఈ సమయానికి వినాయక్ ప్రాజెక్ట్ తో పాటు ఈ సినిమాని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్నది మెగాస్టార్ చిరంజీవి ప్లాన్. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కీలకం. అందుకే దర్శకుడు వెంకీ కుడుములు యేడాది సమయం కావాలని అడిగాడట. మరో ఆరు నెలల్లో స్క్రిప్టు సిద్ధం చేసి, నటీనటులు, మిగిలిన తారాగణం ఎంపిక చేస్తారు. ఇంకా ఎంతమంది దర్శకులు మెగాస్టార్ తో మాస్ సినిమాలు చేస్తారో చూడాలి.
Also Read: ప్చ్.. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్