టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘గాడ్ ఫాదర్’ మూవీ ఒకటి. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు వ్యవహరిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. చరణ్ – నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట.
‘లూసిఫర్’లో పృథ్వీరాజ్ చేసిన పాత్రకిగాను తెలుగు రీమేక్ లో సల్మాన్‌ను అనుకున్నారు. చిరు – సల్మాన్ కుటుంబాల మధ్య ఎప్పటినుండో మంచి రిలేషన్ షిప్ ఉంది. అందువల్లనే ఈ ప్రత్యేకమైన పాత్రను చేయడానికి బాయ్‌జాన్ ఒప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి కాంబినేషన్‌లోని సన్నివేశాలను ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్‌లో రేపటి నుంచి చిత్రీకరించనున్నారు.
ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు జరగనుంది. అయితే ఈ వారం రోజులు చిరు సల్మాన్ ఫామ్ హౌస్‌లో ఉంటారట. అత్యంత విలాసవంతమైన ఈ ఫామ్ హౌస్‌లో సల్మాన్ కి అత్యంత ఆత్మీయులు మాత్రమే విడిది చేస్తారట. ఇక చిరు నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.