‘భీమ్లానాయక్’ తిరుగులేని విజయం- చిరు

108
- Advertisement -

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రల్లో.. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలన్నీ పాజటివ్‌గా వచ్చాయి. విమర్శకులు సైతం పవన్, రానాల నటనకు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సినిమా విజయంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుపానే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్ సెట్స్ పై సోదరుడు పవన్ కల్యాణ్, రానాలతో దిగిన ఫొటోను పంచుకున్నారు.

- Advertisement -