ANR అవార్డు .. నా పూర్వజన్మ సుకృతం:చిరు

3
- Advertisement -

ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది.

పద్మ విభూషణ్, ఏయన్నార్‌ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హృద్యంగా జరుగుతున్నటువంటి ఈ చక్కటి సభలో మీ కరతాల ధ్వనుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. మై గురు మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్ గారు ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్’ సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐయామ్ ఓవర్ వెల్మ డ్. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నాను. బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ గారి నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం. థాంక్యూ సో మచ్ బచ్చన్ జి. మీ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మితాబచ్చన్ గారితో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో ప్రతిభంద్ సినిమా చేసినప్పుడు కేవలం అమితాబచ్చన్ గారికి మొదటిగా చూపించాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రొజెక్షన్ వేసాం. మా ఇద్దరమే ఆ సినిమా చూశాం. సినిమా అంత చూసి ఆయన ‘వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వెరీ పర్పస్ ఫుల్ ఫిలిం. వెరీ గుడ్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్’ అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమితాబచ్చన్ గారు సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయనకి ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి అడిగాను. ‘నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు’ అని చెప్పారు. క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాన. లాంగ్ లీవ్ అమితాబ్ జి. థాంక్యూ సో మచ్.

తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్‌ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. లోపలకు అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను. దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్‌ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా. ఇదే మాట స్టేజీ మీద చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు చెప్పాను.

ఈ వేడుకలో అమ్మని ముందు సీటు లో కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం.. అమ్మ నాగేశ్వరరావు గారికి సీనియర్ మోస్ట్ ఫ్యాన్. నేను కడుపులో ఉన్నప్పుడు నాగేశ్వరావు గారి సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎలాగైనా చూడాలని నాన్న గారితో చెప్పింది. థియేటర్ కి వెళ్లడానికి ఒక జట్కా బండిని ఏర్పాటు చేశారు. జట్కా బండి లో వెళ్తున్నప్పుడు అది కాస్త దారి తప్పి కాస్త పక్కకు దొర్లింది. నాన్న చాలా కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి పోదాం పద అని చెప్పారు. అయినప్పటికీ అమ్మ సినిమాకి వెళ్దామని పట్టుబట్టింది. ఆ సినిమా అమ్మ చూసింది. తర్వాత ఒకటి రెండు నెలల్లో నేను బయటికి వచ్చాను. అమ్మకి నాగేశ్వరరావు గారి సినిమాలు అంటే అంత ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో డాన్స్ లు అంటే నాకు చాలా ఇష్టం. నడవవే వయ్యారి.. అయ్యయ్యో బ్రహ్మయ్య ..దసరా బుల్లోడు సాంగ్స్.. ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాటలు వచ్చినప్పుడు నా పంధాలో డాన్స్ చేసే వాడిని. నాకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ నాగేశ్వరరావు గారు. ఆయన డ్యాన్స్ చూస్తూ ముందుకు వెళ్లాను. నాగేశ్వరరావు గారు స్వతహాగా నా డాన్స్ ని మెచ్చుకుంటూ మాట్లాడడం నాకు ఎంతో నాకు ఎన్నో గొప్ప అవార్డులతో సమానం. ఎన్నో సందర్భంలో ఆయన నా గురించి ప్రస్తావించారు.

Also Read:‘దేవకీ నందన వాసుదేవ’..రిలీజ్ డేట్

మేము మద్రాస్ నుంచి ఇక్కడికి షూటింగ్ కి వచ్చేటప్పుడు ఆయన మమ్మల్ని కలిసి మీరంతా మద్రాస్ నుంచి ఇక్కడికి రావాలని కోరేవారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి తరలిరావాలని ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేసిన కృషి ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం. నాగేశ్వరావు గారు ఎంతో పెద్ద మనసుతో నాలాంటి వారిని ఎంకరేజ్ చేశారు. ఆయన గొప్ప మనసుకి ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాను. ఆయనతో మెకానిక్ అల్లుడు సినిమా చేసే గొప్ప అవకాశం నాకు వచ్చింది. అది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన నడిచి వచ్చే ఒక ఎన్సైక్లో పీడియాలా అనిపించేది. ఆయన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు . ఎన్నో సందేహాలని నివృత్తి చేసేవారు. ఆయన చాలా సరదా మనిషి. చాలా సరదాగా ఉంటారు. అలనాటి ముచ్చట్లు పంచుకుంటారు. ఆయన నాకు ఒక ఫాదర్లీ ఫిగర్ లో ఉండేవారు. వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తానో తెలుసు. తర్వాత ఆ ప్రేమ నాకు నాగర్జున మీద కలిగింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఆరోగ్య సూత్రాలు పాటించడంలో ఎక్సర్సైజ్ చేయడంలో ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి ఆయన తీసుకునే శ్రద్ధ శక్తులు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వాటిని అలవర్చుకుంటాను ఆచరిస్తుంటాను. నాకు నాగార్జున ఒక స్నేహితుడు, బ్రదరే కాదు.. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్ కూడాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. అఖిల్ నాకు మరో బిడ్డ లాగా పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుడిని. నాగ్ లాంటి స్నేహితుడిని నేను జీవితాంతం పదిలంగా దాచుకుంటాను.

దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబచ్చన్ గారు ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకి వచ్చిన ఈ ఏఎన్ఆర్ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను. నాగేశ్వరరావు గారి ఆశీస్సులు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ క్షణాన్ని జీవితాంతం నా మనసులో పదిలపరుచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైహింద్’ అన్నారు

బిగ్ బి అంతా బచ్చన్ గారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇండియన్ సినిమాకి నాగేశ్వరరావు గారు చేసిన సేవలు అనితర సాధ్యం. డియన్ సినిమాకి నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. నాగేశ్వరరావు గారి లెగిసిని కంటిన్యూ చేస్తున్న నాగార్జునకి నా అభినందనలు. ఐ యాం వెరీ గ్రేట్ ఫుల్ టు యు నాగ్. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారికి ఈ అవార్డును నేను ప్రధానం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. నేను ఎప్పుడు ఏది అడిగినా ఆయన సిద్ధంగా ఉంటారు. థాంక్యూ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి సినిమాలో నటించాను. నాగ్ అశ్విన్ సినిమాలో నటించాను. నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పార్ట్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. చిరంజీవి గారి ఫ్రెండ్షిప్ కి థాంక్యూ సో మచ్. చిరంజీవి గారి ప్రేమ అభిమానం ఆప్యాయతకి ధన్యవాదాలు. ఇకపై నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్ గా తీసుకుంటారని కోరుతున్నాను. నాగ్ అశ్విన్ నెక్స్ట్ టైం తన ఫిలిమ్ లో తీసుకోవాలని కోరుతున్నాను(నవ్వుతూ) అందరికీ థాంక్యూ సో మచ్ ‘అన్నారు

కింగ్ అక్కినేని నాగార్జున గారు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఏయన్నార్‌ ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న గారు హ్యుమానిటీని నమ్మారు. మనుషుల్ని నమ్మారు. న్నిటికంటే ముఖ్యంగా సినిమాని బిలీవ్ చేశారు. అభిమానులు, ప్రేక్షకులు మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్ గా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు, ఇండియన్ సినిమా ఏ బి సి.. అమితాబచ్చన్ జి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది నా డియర్ ఫ్రెండ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డుని నేను ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం ఇంకా స్పెషల్. కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ గారు ఏఎన్నార్ అవార్డుని అందుకోవడం లు అవార్డు ప్రతిష్టని మరింతగా పెంచింది. ఈరోజు చిరంజీవి గారికి అవార్డు ప్రధానం చేయడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఇస్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఎంతో ఆనందంగా నవ్వారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమితాబచ్చన్ గారి స్క్రీన్ ప్రజెంట్, మేనరిజం, ఇంపాక్ట్ సింప్లీ అండ్ అన్ టచబుల్. అమితాబ్ బచ్చన్ గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. హ్యాట్సాఫ్ అమితాబచ్చన్ గారు. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి. ఆయన సినిమాలు గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఇట్లు సూపర్ హిట్లు బ్రేక్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈమధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ ని చూడమని నాకు చెప్పారు. అప్పుడు రెయిన్ సాంగ్ జరుగుతుంది. చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయనలాగా డాన్స్ చేయగలనా అనిపించింది. అలా ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి గారి స్పెక్టాక్యులర్ సినిమా జర్నీ మనందరికీ తెలుసు. అలాగే ఆయన వెలకట్టలేని సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సి బాధ్యత మన మీద ఉంటుందని. చిరంజీవి గారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిచారు.అది ముమ్మాటికి నిజం. ఇలాంటి ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అమితాబచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డు ని చిరంజీవి గారిని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం. కీరవాణి గారు మా ఫాదర్ జర్నీ ని వారి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. థాంక్యూ కీరవాణి గారు. ఈ వేడుకకి విచ్చేసిన స్నేహితులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ స్వాగతం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థాంక్యూ ఆల్. ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’ అన్నారు

టి సుబ్బిరామిరెడ్డి గారు మాట్లాడుతూ. నాగార్జున ఎక్స్ ట్రార్డినరీ పర్శన్. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఎంత గొప్పగా ఈ అవార్డు వేడుకని ఏర్పాటు చేశారు. నాగార్జునని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు 60 సంవత్సరాల నుంచి నాకు అక్కినేని నాగేశ్వరరావు గారికి అనుబంధం ఉంది. ఆయన నటన హిమాలయాల శిఖరాలకు వెళ్లింది. ఆయన జీవితం అద్భుతం అమోఘం. ఆయన ఎప్పుడూ నా గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. నాగేశ్వరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో ఏఎన్ఆర్ అవార్డు కూడా అంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని నన్ను చైర్మన్ గా చేశారు నేను రెండుసార్లు చైర్మన్ గా ఉన్నాను . ఈ అవార్డు కమిటీ చైర్మన్ ఉండడం నాకు ఎంతో సంతోషం, గొప్ప గౌరవం. ఎంతో మంది లెజెండ్స్ కి అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. ఈసారి మరో గొప్ప లెజెండ్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం మాకెంతో గౌరవంగా ఉంది. చిరంజీవి గారు అందరి గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. చిరంజీవి గారు గర్వాన్ని జయించిన గొప్ప మనిషి. అలాగే అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా మహోన్నతమైన వ్యక్తి. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ గొప్ప మానవత్వంతో ఉంటారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. చరిత్రలో ఎవరు ఇలా చేయలేదు. ఎంతోమంది ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చారు అలాంటి చిరంజీవి గారికి ఏఎన్నార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ టు ఆల్’ అన్నారు.

ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా సన్మానించారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.

- Advertisement -