క్లైమాక్స్‌ షూటింగ్‌లో విశ్వంభర

6
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ వండర్ గా వుండబోతోంది. వశిష్ట క్రియేటివ్ అప్రోచ్ తో ఫాంటసీ ఎలిమెంట్స్ ని విజువల్ గా మహాఅద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.

ఈ ఇంటెన్స్ క్లైమాక్స్‌ కి ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్ల్ అరసు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. తన అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రతో క్లైమాక్స్‌ అవుట్ స్టాండింగ్ గా వుండబోతోంది. క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలను మించి వుంటుంది.

క్లైమాక్స్ సీక్వెన్స్ స్కేల్, స్కోప్ చాలా గ్రాండ్‌గా వుంటాయి, ఇందులో మ్యాసీవ్ సెట్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లతో మూవీ ఫాంటసీ నెక్స్ట్ లెవల్ వుండబోతున్నాయి.ఈ క్లైమాక్స్ షోడౌన్‌లో చిరంజీవి చరిష్మాటిక్ ప్రజెన్స్ తో విశ్వంభర మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా వుంది. ఫైనల్ యాక్ట్ మూవీలో హైలైట్‌, గ్రాండియర్ గా ఉండబోతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వంభర లో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.విశ్వంభర జనవరి 10, 2025న విడుదల కానుంది.

Also Read:KTR: దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

- Advertisement -