సావిత్రి జీవితచరిత్రను ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ సావిత్రి జీవితాన్ని తెర మీద చూపించిన విధానం అటు సామాన్య ప్రజలకూ… ఇటు విమర్శకులకూ ఎంతో నచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్- స్వప్నా దత్ లతో పాటు దర్శకుడు నాగ అశ్విన్ ను కలిసి అభినందించారు.
మొదటి నుంచి కూడా ‘మహానటి’ని తెరకెక్కించే ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న చిరంజీవి, తాజాగా నాగ్ అశ్విన్ తో పాటు ప్రియాంక దత్, స్వప్నదత్ లను తన ఇంటికి ఆహ్వానించారు. ‘మహానటి’ని అందంగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయినందుకు, తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగిన ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ సత్కరించారు. ఈ నేపథ్యంలో చిరుతో మూవీ తెరకెక్కించాలనే అలోచనలో ఉన్నాడట దర్శకుడు నాగ అశ్విన్.
ఈ సందర్బంగా చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పగా .. ఈ సినిమా వైజయంతీ బ్యానర్లో వుంటుందనే విషయాన్ని అశ్వనీదత్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో నాగ్ అశ్విన్ చేయనున్నది జానపద కథ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘భైరవ’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇ మూవీ గురించి అధికారిక ప్రకటన రావల్సివుంది.