Chiru:బాలయ్యకు చిరంజీవి కౌంటర్

4
- Advertisement -

నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జగన్ ప్రభుత్వంలో చిరంజీవికి అవమానం జరిగిన మాట వాస్తవమే…చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగొచ్చారన్నది అబద్ధం,గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ బాలయ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానని.. లంచ్ కు రావాలని నాడు జగన్ నన్ను ఆహ్వానించారని చిరంజీవి వెల్లడించారు. జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లాన..సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించానన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనతో చెప్పానన్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల వల్ల ఐదుగురే రావాలని జగన్ చెప్పారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 10 మంది వస్తామని చెబితే అందుకు జగన్ ఒప్పుకున్నారని …ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు.

తన చొరవ వల్లే ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. జగన్ వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందని… వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు.

Also Read:సుధీర్ బాబు..’జటాధర’

- Advertisement -