చిరంజీవికీ తప్పని డీప్ ఫేక్ కష్టాలు..

7
- Advertisement -

డీప్ ఫేక్ బారిన పడ్డారు మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు చిరంజీవి. చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారు సైబర్ నేరగాళ్లు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మెగాస్టార్. తన పరువు, ఆర్థిక హక్కులకు ఆ వీడియోలు భంగం కలిగిస్తున్నాయంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి.

పిటిషన్ పై విచారణ జరిపి తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది కోర్టు. చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్, బిరుదులను వాణిజ్య, వ్యక్తిగత ప్రచారాలకు ఉపయోగించవద్దని కోర్టు ఆదేశించింది.

Also Read:హైదరాబాద్‌లో #VT15

- Advertisement -