మెగాస్టార్ చిరంజీవికి కొడుకు రామ్ చరణ్ కోడలు ఉపాసన ఎంతో ఇష్టం. చాలా వేదికలపై వారిద్దరిపై తనకు ఉన్న ప్రేమను పంచుకున్నారు చిరు. చిరంజివి నటించిన సైరా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటివలే హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే ఈ వేదికకు చిరు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈఫంక్షన్ కు వచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసాన తన మామయ్య చేత ఫొటోలు తీయించుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పంచుకున్నారు ఉపాసన. సైరా నరసింహారెడ్డి ఈవెంట్కు ముందు నా స్వీటెస్ట్ మామయ్య నా ఫొటోలు తీశారు. నేను వేసుకున్న దుస్తులు ఆయనకు ఎంతో నచ్చాయి. అందుకే ఆయన ఫొటోలు తీశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు గోడపై కనిపిస్తున్న ఆయన ప్రతిరూపాన్ని మీరు చూడొచ్చు అంటూ కామెంట్ పెట్టింది. ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Check out My sweetest Mamaya #MegastarChiranjeevi in the reflection taking my pic post the #syeeranarasimhareddy event.He loved my dressing ❤️.Truly an amazing way to celebrate #nationaldaughtersday 🙏🏼 & a super successful event.Thanks for all ur love & blessing@AJSKOfficial pic.twitter.com/KTVMR6joaQ
— Upasana Konidela (@upasanakonidela) September 23, 2019