పెద్దమ్మ తల్లి సన్నిధిలో భోళాశంకర్..

102
chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం భోళాశంకర్. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ సినిమా లాంఛ్ కాగా షూటింగ్‌ తొలిరోజు సందర్భంగా ఇవాళ పెద్దమ్మతల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక తమన్నా, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది.

అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అద్బుతమైన నటీనటులు, సాంకేతిక బృందం పని చేయబోతోన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారు.2022లో భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -