కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులే వస్తారు : చిరంజీవి

31
chiru
- Advertisement -

టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం బింబిసార, యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ లవ్‌స్టోరీ సీతారామం ఈ రెండు చిత్రాలు శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందాలను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడంలేదని బాధపడుతున్న చిత్ర పరిశ్రమకు ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ శుక్రవారం విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈసందర్భంగా సీతారామం, బింబిసార నటీనటులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని చిరు పేర్కొన్నారు.

- Advertisement -