ఇంట్లోనే ఉందాం.. ఆరోగ్యం పంచుదాం.. చిరు

614
chiru
- Advertisement -

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. అయితే ఈ పండుగని పండుగలా జరుపుకునే పరిస్థితి లేదు. నేటి ఈ లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేలా సహకరించాలని వేడుకుంటున్నాను అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “బాధ్యతారాహిత్యంగా బయటకి వచ్చి, మరింత వ్యాప్తి చెందడానికి దోహదపడొద్దని వేడుకుంటున్నాను. పొడిగించబడ్డ ఈ లాక్‌డౌన్ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు విధిగా పాటించడం అవసరం, ఉత్తమం అన్నారు.

మెగాస్టార్ సూచించిన జాగ్రత్తలు..

  • రోజువారీగా వాడే పచారి సమానులు వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోవాలి.
  • వేపుళ్ళు, కాలక్షేప తినుబండారాలు లేకుండా చూసుకోవాలి.
  • అలాగే పాయసం, పరమాన్నం, అరిసెలు లాంటి తీపి పిండివంటలు వదిలేద్దాం.
  • ఖాళీగా ఉన్నాం కదా కొత్త వంటలు చేద్దాం అనే ఆలోచన గానీ, అలాంటి ప్రయోగాలు కానీ మానుకుందాం.
  • మన చిన్నతనంలో బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ మనకు చేసిపెట్టిన తరహాలో కనీస కూరలతో భోజనం కానిద్దాం.
  • నిత్యావసర వస్తువుల్ని ఆచితూచి పొదుపుగా వాడుకుందాం.
  • అలా చెయ్యడం వలన అన్నీ అయిపోయాయి, కొనాలంటే వస్తువులు దొరకడం లేదు అనే కంగారు, ఆందోళన పడే పరిస్థితి రాదు.
  • ఈ 3 వారాలకు కావాల్సిన సరుకులు, అవసరం మేరకు మాత్రమే కొని పొందుపరుచుకుందాం.
  • ఎందుకైనా మంచిది అని అవసరం మీరి కొనడం వలన బయట చిన్న బిడ్డలకు, వృద్ధులకు, అవసరార్ధులకు ఆయా వస్తువులు దొరకక కొరత ఏర్పడవచ్చు.
  • కనుక పొదుపు ఆచరించి ఇతరుల అవసరాలకు కూడా సహకరిద్దాం.
  • ఇలా తగ్గించి వాడడం ద్వారా ఇంట్లో చెత్త కూడా ఎక్కువగా పేరుకుపోదు.
  • తద్వారా వీధిలోని చెత్త కూడా పేరుకుపోదు, ఇలా పారిశుద్ధ్యానికి సహకరిద్దాం.
  • మనం భారతీయులం ఒక్కటై రోజు రోజుకి పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తిరి పెరగనివ్వకుండా నివారిద్దాం.. నేలమట్టం చేద్దాం.
  • ఈ లాక్ డౌన్ ప్రకటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ కి, సహకరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా అభినందనలు, ధన్యవాదాలు.
  • ఈ సమయంలో ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం.. ఆరోగ్యం పంచుదాం.. జైహింద్.
- Advertisement -