చిరంజీవి ‘లూసిఫర్’ దర్శకుడిగా సుకుమార్?

432
sukumar-to-direct-chiranjeevi_
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి ఇటివలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈమూవీని రామ్ చరణ్‌ నిర్మించారు. ఇక ఈమూవీ తర్వాత చిరంజీవి 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఇటివలే ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంది. ఇక ఈమూవీలో రామ్ చరణ్ కూడా నటించనున్నాడని సమాచారం.

చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారు. ఈ మూవీ ప్రారంభంకాకముందే చిరంజీవి 153వ సినిమాకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళంలో ఈ మధ్య మోహన్ లాల్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈమూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ దక్కించుకున్నారు.

చిరంజీవి 153వ సినిమాగా ఈసినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈమూవీకి దర్శకుడిగా సుకుమార్ ను ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సుకుమార్ రామ్ చరణ్‌ తో రంగస్ధలం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో సుకుమార్ కు మెగా ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడింది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్రయూనిట్.

- Advertisement -