చిరు 152మూవీలో శృతి హాసన్

435
chiranjeevi 152 movie
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఇటివలే సైరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమూవీ భారీ విజయం సాధించింది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమాను రామ్ చరణ్‌ నిర్మించారు. అమితాబ్ బచ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తి బాబు , న‌య‌న‌తార వంటి స్టార్స్ చిత్రంలో భాగ‌మ‌య్యారు. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌య సాధించ‌డంతో చిరు ఫుల్ ఖుష్ అయ్యారు.

ఇక చిరంజీవి తన తర్వతి మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో చేయనున్నాడు. ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటివలే పూర్తయ్యాయి. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. సామాజిక సందేశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో రామ్ చ‌ర‌ణ్ .. యంగ్ చిరంజీవి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

తమిళ యంగ్ హీరో ఆర్య ఒక కీలకమైన రోల్ లో యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం సూపర్ స్టార్ మోమన్ లాల్ ఈమూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అతుల్-అజయ్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

- Advertisement -