మెగాస్టార్‌ నెక్ట్స్‌ మూవీలో హీరోయిన్‌..?

231
Chiranjeevi 150th Movie Heroines
- Advertisement -

‘ఖైదీ150’ సినిమా తర్వత మెగాస్టార్‌ చిరంజీవి తదుపరి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తెరకెక్కనుందని సమాచారం. ఈ విషయం సోషల్‌ మీడియాలో కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన ఏ హీరోయిన్‌ ని ఎంచుకోవాలి అనే ఆలోచనలో చిత్ర టీమ్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Chiranjeevi 150th Movie Heroines

ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ‘ఖైదీ నెంబర్ 150’లో అనుష్క హీరోయిన్‌ గా చేయవలసి వుంది. కానీ.. ఆ సమయంలో ఆమెకి డేట్స్‌ కుదరక బిజీగా ఉండటం వలన అనుష్క ‘ఖైదీ నెంబర్ 150’లో నటించలేకపోయింది.

అందుకే ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకి అనుష్కను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇలా అనుష్క పేరు వినిపిస్తుండగానే తాజాగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తుండటం విశేషం.

Chiranjeevi 151th Movie Heroines

మొదట అనుష్కను అనుకున్నా..మళ్ళీ శ్రుతి హాసన్‌ పేరు వినబడడంలో మతలబేంటి? ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఎవరిని ఎన్నుకోనున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మరి అనుష్కకి ఈ సారి కూడా డేట్స్ సర్దుబాటు చేలేదా? లేదంటే ఆమె విషయంలో ఈ సినిమా టీమ్ మనసు మార్చుకుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరో రకంగా ఆలోచిస్తే… అనుష్కతో పాటే మరో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

- Advertisement -