- Advertisement -
తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చింత… ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సంస్థకు మంచిపేరు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చదువుకొనే రోజుల నుంచి ముఖ్యమంత్రికి చేనేత కార్మికుల సమస్యలు తెలుసునని అన్నారు. ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు.
- Advertisement -