- Advertisement -
కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చిన్ని. నిమా తెలుగు, తమిళ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘చిన్ని’ చిత్రంలో కీర్తి ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్ పాత్రను పోషించింది. సఖినేటి పల్లికి చెందిన ఒక కానిస్టేబుల్ చిన్ని. ఆమెను 24హత్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆమెకు తోడుగా ఉన్నా రంగయ్య అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు. అసలు వీరిద్దరూ ఎవరు..? ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్ చిన్నికి జరిగిన అన్యాయం ఏంటి? ఎవరిమీద ఆమె పగ తీర్చుకుంటుంది..? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిన్ని సినిమా. మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -