వనపర్తిలో చిన్నారెడ్డి VS మేఘారెడ్డి

8
- Advertisement -

పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు పలు గ్రామాల్లో ఓడిపోవడానికి చిన్నారెడ్డే కారణమని ఆయన ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో పార్టీకి వెన్నుపోటు పొడిచి, ప్రత్యర్థులకు లాభం చేకూరేలా వ్యవహరించారని మేఘారెడ్డి మండిపడ్డారు. చిన్నారెడ్డి చర్యల వల్ల తనకు మాత్రమే కాకుండా, వనపర్తి ఎంపీ మల్లు రవికి కూడా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. పార్టీ అభ్యర్థుల ఓటమి వెనుక అంతర్గత కుట్రలు ఉన్నాయని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో పార్టీని బలపర్చే బాధ్యత ఉన్న నేతలే పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, చిన్నారెడ్డి వ్యవహారంపై పూర్తి ఆధారాలతో పార్టీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Also Read:సరస్వతి పుత్రిక చదువు కోసం హరీష్ ఔదార్యం..

- Advertisement -