ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రజలకు సీఎంగా కేసీఆర్ దొరకడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ భద్రాద్రి శ్రీరామచంద్రస్వామిని దర్శించుకున్న చినజీయర్ స్వామి కేసీఆర్‌తో దేవాలయాలకు స్వర్ణయుగం వస్తుందన్నారు. సీఎం కోరిక మేరకు భద్రాచలం ఆలయంతో పాటు ప్రాంగణంలో ఆగమశాస్త్రం ప్రకారం మార్పులు సూచించామని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తన షష్ట్యబ్ది ఉత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా చినజీయర్ స్వామి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. పదిమంది చుట్టు చేరితె ఒళ్లు తెలియదు. చుట్టు మందీ మార్భలం ఉంటే తమను మించిన వారు లేరనుకుంటారు. సంపద, పదవి చేతికి అందితే కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వారు కాదు అని ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ టీటీడీగా రూపుదిద్దుకుంటోన్నయాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆధ్యాత్యికతకు, ఆగమ, వాస్తు శాస్త్ర నిబంధనల ప్రకారం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న సంగతి తెలిసిందే.