దీపావళి ఖర్చుతో ఆర్మీని ఆదుకుందాం…

229
- Advertisement -

ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు సందేశాలిచ్చే త్రిదండి చినజీయర్ స్వామి…తొలిసారిగా రాజకీయాల గురించి మాట్లాడారు. యూరీ ఉగ్రదాడి దారుణమని, అందుకు ధీటుగా పాక్‌కు భారత ఆర్మీ గట్టి సమాధానం ఇచ్చిందని అన్నారు. ఇరుగుపొరుగుతో సఖ్యతతో ఉండాలన్నదే భారత విధానమని, ధర్మం, దేశం రెండింటిని రక్షించుకోవాలని ఆయన తెలిపారు.దీపావళి, దసరా ఖర్చులు తగ్గించుకుని ఆర్మీకి కొంత ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్మీ నిధికి పది లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని, సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించి, వారికి పునరావాసం కల్పిస్తోందని, అలాంటి సమయంలో దేశప్రజలంతా కేంద్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.వాజ్ పేయి ప్రధానిగా ఉండగా, పాకిస్థాన్ తో సామరస్యపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించి…లాహోర్ కు బస్సు వేస్తే, ఆ దేశం మనకు ఇచ్చిన బహుమతి కార్గిల్ వార్ అని ఆయన గుర్తు చేశారు.

chinnazeeyar

దేశప్రజలు భద్రంగా ఉంటున్నారంటే జవాన్ల చలువేనని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రతి భారతీయ పౌరుడు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కేవలం హిందూ ధర్మాచార్యులు మాత్రమే కాకుండా ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ ఇతర ధర్మాచార్యులు కూడా దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

- Advertisement -