- Advertisement -
దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికల్లో సీనియర్ నటుడు రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రాధారవికి పోటీగా నిలబడతానని ప్రకటించిన సింగర్ చిన్మయి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి తిరస్కరించారు. నిబంధనలకు విరుద్దంగా చిన్మయి నామినేషన్ ఉందంటూ తిరస్కరించారు.
తన నామినేషన్ తిరస్కరణపై చిన్మయి కోర్టుకు వెళ్తానని ప్రకటించింది. గతంలో ‘మీటూ’ వ్యవహారంలో రాధారవి, చిన్మయి మధ్య వివాదం తలెత్తింది. రాధారవిపై చిన్మయి పలు ఆరోపణలు చేసింది. దీంతో చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అయితే, ఆమె కోర్టును ఆశ్రయించి సంఘంలో మళ్లీ చోటు సంపాదించింది. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
- Advertisement -