ప్రభుత్వ ధనంతో నిర్మించలేదు:చినజీయర్ స్వామి

78
swamy
- Advertisement -

సమతామూర్తి విగ్రహాన్ని ప్రభుత్వ ధనంతో నిర్మించలేదన్నారు చినజీయర్ స్వామి. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో పోలీసుల బందోబస్తుపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ముచ్చింతల్ లోని జీవా ప్రాంగణంలో 7 వేల మంది పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చినజీయర్ స్వామి..దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారన్నారు.

వచ్చే అతిథులు, భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ధనాన్ని తీసుకొని ఈ ప్రాజెక్టు నిర్మించలేదని…సమతామూర్తి ప్రాజెక్టుకు విరాళాలు ఇవ్వమని సామాన్యులను కోరాం అన్నారు. సంపాదనలోనూ, ఖర్చులోనూ ఎంత ఎక్కువైతే అంత ఒక నెల ఇవ్వమని కోరాం..మొట్టమొదట స్పందించి నెల జీతం ఇచ్చింది ఏపీ పోలీసు అధికారి కోటేశ్వరరావు అన్నారు.

పోలీసు శాఖలో అంకితాభావం, పట్టుదలతో ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని….ఒక పిల్లాడు తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీ రూ.10లు రామానూజచార్యుల విగ్రహానికి విరాళం ఇచ్చాడన్నారు. షికాగోలో ఒక చిన్నారి తన పిక్కీబ్యాగ్ నుంచి 5వేల డాలర్లు ఇచ్చిందన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని రైతుకూలీ రూ.10 వేలు ఇచ్చాడు…సమతామూర్తి విగ్రహా ఆవిష్కరణకు రైతు కూలీలు కూడా వస్తారన్నారు. రైతు కూలీల శ్రమ కూడా సమతామూర్తి నిర్మాణంలో ఉంది. అలాంటి వారికి కూడా పోలీసుల సాయం ఇప్పుడు అవసరం అన్నారు. పోలీసులపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తుంటాయి…ఇలాంటి చోట్ల పోలీసులు, వారి కుటుంబ సభ్యులే ఉంటారనే విమర్శలు వస్తుంటాయన్నారు.

ఉదయం 6గంటల నుంచే మధ్యాహ్నాం 1 గంట వరకు ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కార్యక్రమాలుంటాయన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రపారాయణం ఉంటుందన్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి…5న ప్రధాని, 7న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , 8న అమిత్ షా,13న రాష్ట్రపతి వస్తారు…వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వారి సమయానుకూలంగా వస్తారన్నారు.

- Advertisement -