చైనాలో విక్టరీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనకు ముఖ్యఅతిథులుగా హాజరైన రష్యా, నార్త్ కొరియా సహా 26 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. తొలిసారి అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది చైనా.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయానికి గుర్తుగా ప్రతి ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది చైనా. ఆధునిక ఆయుధ శక్తిని ప్రదర్శించింది బీజింగ్. జెట్ ఫైటర్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు తదితర సాంకేతిక సామగ్రిని ఆవిష్కరించింది.
జపాన్‌పై రెండో ప్రపంచ యుద్ధ విజయానికి 80 ఏళ్లు పూర్తైన సందర్భంలో ఈ పరేడ్ నిర్వహించారు. వందలాది సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్ పొరుగు దేశాల నాయకుల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహ్‌బాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కే.పి.శర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ పాల్గొన్నారు. విదేశీ అతిథులను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియుయాన్ స్వాగతం పలికారు.
Also Read:‘మిరాయ్’లో అంబికగా శ్రియ శరణ్

