భారత్, చైనా మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

209
india china
- Advertisement -

భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు శాంతిచర్చలతో బ్రేక్ పడింది. బుధవారం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగగా మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా చర్చలు జరగడంతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇక భారత్‌తో జరుగుతున్న చర్చలపై చైనా తాజా ప్రకటన చేసింది. రెండు దేశాలూ దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంబంధిత అంశాలపై సుహృద్భావ వాతావరణంలో అర్ధవంతమైన చర్చలు జరుపుతున్నాయని తెలిపింది.

చర్చలు అర్ధవంతంగా సాగుతుండటంతో చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది. గాల్వన్‌ ప్రాంతంతో పాటు మరో నాలుగు చోట్ల చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది.

- Advertisement -