ఉత్తర కొరియాలో చైనా అధ్యక్షుడు!

4
- Advertisement -

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన మొదటి అధికారిక పర్యటన నిమిత్తం ఉత్తర కొరియా చేరుకున్నారు. గత ఏడేళ్ల కాలంలో చైనా దేశాధినేత ….ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ప్రాంతీయ భద్రత మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సైనిక వందనంతో పాటు ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. వేలాది మంది ఉత్తర కొరియా ప్రజలు చైనా, ఉత్తర కొరియా దేశాల జెండాలను చేతబూని చైనా అధ్యక్షుడికి ఉత్సాహంగా స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా షీ జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్ లు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ, శాంతి స్థాపన మరియు ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లను కలిసికట్టుగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇద్దరు నేతలు ఒక వ్యూహాత్మక అవగాహనకు రానున్నారు.

Also Read:‘పెద్ది’ నాలుగో రోజు కలెక్షన్స్!

ఉత్తర కొరియాకు చైనా మొదటి నుండి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉంది. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల బంధం మరింత పటిష్టం కానుందని చైనా దౌత్య వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ అధికారిక పర్యటనలో షీ జిన్‌పింగ్ గౌరవార్థం కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇరు దేశాల సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించేలా పలు ప్రదర్శనలను కూడా నిర్వహించనున్నారు. ఈ పర్యటన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలపై సానుకూల ప్రభావం చూపుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -