మరో కొత్త వైరస్‌.. వస్తే 3 రోజుల్లోనే ఖతం!

8
- Advertisement -

కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయానికి ప్రపంచమంతా వణికిపోయింది. చైనాలోని ల్యాబ్ నుండే కరోనా పుట్టిందనే వాదన కూడా ఉంది. తాజాగా చైనా నుండి మరో వైరస్ రాబోతుందనే చర్చ జరుగుతోంది. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కేవలం మూడు రోజుల్లోనే ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్‌ను సిద్ధం చేశారు.

ఎబోలా వైరస్‌ను అనుకరించేందుకు శాస్త్రవేత్తలు సింథటిక్ వైరస్‌ను ఉపయోగించినట్లు సమాచారం. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు హెల్త్‌ చైనీస్ శాస్త్రవేత్తలు కొత్త వైరస్ ఎబోలాను సృష్టించినట్లు తెలుస్తోంది. ఎబోలా వైరస్‌ను పోలిన ఈ కొత్త సింథటిక్ వైరస్‌ను ఇటీవల దాదాపు 10 చిట్టెలుకలపై పరీక్షించారు. టీకా వేసిన 3 రోజుల తర్వాత చిట్టెలుకలలో తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని నివేదికలు చెబుతున్నాయి.

ఈ భయంకరమైన వైరస్ బారి నుండి విరుగుడు కనిపెట్టేందుకు అగ్రరాజ్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. 2014 నుంచి 2016 మధ్యకాలంలో ఆఫ్రికన్ దేశాలపై ఎబోలా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపగా వేలాది మంది ప్రాణాలు కల్పోయారు.

Also Read:బాలయ్య 109.. టైటిల్ టీజర్?

- Advertisement -