వైట్‌ హౌజ్‌ డ్రాగన్‌ మధ్యలో తైవాన్‌….

91
nanci
- Advertisement -

అమెరికా చైనాల మధ్య అంతర్జాతీయ రాజకీయ సంక్షోభం వలన ఇరు దేశాలు గుర్రుగా ఉన్నాయి. తాజాగా చైనా అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చింది. అమెరికా హౌజ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా టూర్‌లో ఉంది. నాన్సీ తైవాన్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . తైవాన్‌ అంశంలో వైట్‌ హౌజ్‌, డ్రాగన్‌ మధ్య కొన్నాళ్ల నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్‌ను తమ భూభాగంగా చైనా భావిస్తోంది. ఆ ప్రాంతానికి నాన్సీ వెళ్లడాన్ని రెచ్చగొట్టే చర్యగా భావిస్తామని చైనా పేర్కొంది. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌ కాల్‌లో మాట్లాడుతూ ఈ విషయంపై గట్టిగానే హెచ్చరించారు.

చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె మలేసియాలో ఉన్నారు. ఈ రాత్రికి ఆమె తైపే నగరానికి చేరుకునే అవకాశాలున్నాయని పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో అమెరికా అప్రమత్తమైంది. తైవాన్‌ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్‌ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ క్యారియర్‌ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని సదరు కథనం పేర్కొంది. తైవాన్‌కు తూర్పువైపున ఈ యుద్ద నౌకలు మోహరించినట్లు సమాచారం.

- Advertisement -