తెలుగు సినిమాల్లో టాప్ హీరోలు సిగరెట్ తాగుతూ.. డైలాగ్ చెబుతుంటే సినీ అభిమానులు ఎంతలా కేకలు వేస్తారో చూసే ఉంటాం. అయితే అదే ఓ చింపాంజీ సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది. వినడానికే విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. డాలీ అని పిలుచుకునే ఈ చింపాంజీ సిగరెట్ తాగుతుంది. తనకీ కేకలు పెట్టే అభిమానులున్నారు. తనకంటూ ఒక స్టైల్ కూడా ఉంది. అది మాములు చింపాంజీ కాదు.. చైన్ స్మోకర్ చింపాంజీ.. చింపాంజీ స్మోకింగ్ ఏంటని సందేహమా..? అయితే ఈ స్టోరీ చదవండి.
ఎప్పుడో పాతకాలపు జూని మళ్లీ మరమ్మత్తులు చేసి ప్రారంభించారు అక్కడి అధికారులు. మరీ జూ పూర్వవైభవాన్ని మళ్లీ తీసుకురావలంటే ఎదైనా కొత్తగా ఉండాలని వారు ఆలోచించారు. ఇలా ఆలోచిస్తుండగా డాలీ అనే ఆడ చింపాంజీ వారి కంట పడింది. దాన్ని తీసుకొచ్చి జూలో పెట్టారు. దాని విశేషమేమిటంటే రోజుకు సిగరెట్ ప్యాకెట్ కాలుస్తుందట. అంతేకాదు దాని సిగరెట్ అదే అంటించుకుంటుంది. దాని ట్రైనర్ భయటి నుండి లైటర్ లోపల వేయగానే అచ్చం మనిషిలాగానే ఎంత స్టైల్‌గా సిగరెట్ అంటించుకుంటుందో ఒకసారి ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది.
అయితే లైటర్ అందుబాటులో లేకపోతే సిగరెట్ ఎలా అంటించుకోవాలో కూడా తెలుసు ఈ డాలీకి.. ఎలాగంటే ఒక అంటించిన సిగరెట్‌ను విసిరేస్తే.. దాంతో సిగరెట్ అంటించుకుంటుంది.
ఇలాంటి ఫీట్లపై యూకేలో ఎన్నో గొడవలు.. ఫిర్యాదులు వస్తున్నప్పటీకి.. సందర్శకులు.. పర్యాటకులు మాత్రం వీటినేం పట్టించుకోవట్లేదు. డాలీ సిగరెట్ తాగే స్టైల్ చూసి అరుపులు పెడుతున్నారు. ఇక తనను చూడ్డానికి వచ్చిన సందర్శకులకు వంగి మరీ ధన్యవాదాలు తెలుపుతుంది.
ఈ జూలో ఇదొక్కటే కాదు. ఇంకా చాలా వింతలున్నాయి. ఇక్కడి కోతులు బాస్కెట్ బాల్ అడుతాయి. ట్రైన్డ్ శునకాలు కూడికలు,తీసివేతలు అబాకస్ లెక్కలు చేస్తాయట.