జై పాత్ర సూపర్… చెర్రీ కామెంట్

196
Ram-Charan-Hugs-NTR-
- Advertisement -

‘జై లవ కుశ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు, ముఖ్యంగా ‘జై’ పాత్రను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.  బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చూశాడు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో అదరగొట్టేశావంటూ జూనియర్ ఎన్టీఆర్ కు రామ్ చరణ్ చెప్పాడట. ‘జై’ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తారక్ కు చెర్రీ చెప్పినట్టు సమాచారం. కాగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆప్యాయంగా కలిసి, ‘విక్టరీ’ సింబల్ చూపిస్తూ నిలబడి పోజిస్తున్న ఫొటోను ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కూడా ఉన్నారు.

ఆ మధ్యన మహేష్ బాబుతో కలసి ఇదే విధంగా ఫారిన్లో కూడా కలసి చెక్కర్లు కొట్టిన చరణ్.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఏదన్నా టూర్ వెళతాడో లేదో తెలియదు కాని.. ఇలా టాప్ హీరోలు స్నేహంగా ఉంటుంటే.. ఆ కిక్కే వేరబ్బా. వీరు పార్టీల్లోనే కాకుండా ఇలా సినిమాల్లో కూడా కలసి కనిపిస్తే బాగుంటుంది కదూ.

- Advertisement -