వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకని పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షాలు తెలిపారు.
చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలుకుతుందన్నాఉ. పల్లెన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో కోలటాల చప్పుల్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని అన్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా రంగు రంగుల నడుమ కేరింతలతో సాగేది హోలీ.
మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకు అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ, తెలంగాణలోని దళిత బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని సీఎం తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…