చిదంబరంకు బెయిల్ వచ్చేనా..!

491
chidambaram
- Advertisement -

కేంద్ర మాజీమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. గురువారం చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చిన పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిదంబరంకు బెయిల్ వస్తుందా రాదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటుడంతో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. .

చిదరంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి రూ. 305 కోట్ల విదేశీ నిధుల రాకకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్స్ బోర్డు అనుమతులివ్వడం వెనుక అవకతవకలున్నాయని, అందులో ఆయన కుమారుడు కార్తి చిదంబరం ప్రమేయం ఉందని సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది.

- Advertisement -