శనగలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో!

170
- Advertisement -

మనం ప్రతిరోజూ చేసుకునే వంటకాల్లో ఉపయోగించే పప్పు దినుసులలో శనగలు కూడా ఒకటి. శనగలను వివిధ రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. శనగలను గుగ్గిళ్ళ రూపంలో స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. అలాగే శనగలను వివిధ రకాల వంటకల్లో కూడా వాడుతుంటాము. అలాగే శనగ పిండితో చేసుకునే వంటకాలు అనేకం. ఇలా ఏదో ఒక రకంగా శనగలను మన డైలీ ఆహార దినచర్యలో తీసుకుంటూ ఉంటాము. వీటిని ఎలా తీసుకున్న ఇందులో ఉండే ప్రయోజనలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. శనగలలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అందుకే ఒక కప్పు శనగలు 250 గ్రాముల మాంసాహారంతో సమానమని నిపుణులు చెబుతుంటారు. .

ప్రతిరోజూ శనగలను ఉడకబెట్టి తినడం వల్ల శరీరం పుష్టిగా తయారవుతుంది. శనగల్లో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, ఏ, ఇ, వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతరత్రా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హైబిపితో బాధ పడే వారు రోజు ఒక కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే.. ఇందులోని పొటాషియం హైబిపిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా గుండె సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇక డయాబెటిస్ రొగులు కూడా శనగలు తింటే మేలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా అదుపులో ఉంటుంది. ఇక రక్త హీనత వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా శనగలు తింటే మంచిదట.

Also Read:ప్రభుత్వ సలహాదారుడిగా కేకే..బాధ్యతల స్వీకరణ

ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి, ఏ వంటివి రక్త హీనత సమస్యను దూరం చేసి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇక శనగల్లో ఉండే రాఫీనోస్ అనబడే ఫైబర్ కారకం.. జీర్ణ వ్యవస్థలోని విష పదార్థాలను బయటకు పంపించి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. ఇంకా గుండెలో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదాన్నికూడా తగ్గిస్తాయి. అంతే కాకుండా రొమ్ము క్యాన్సర్, వంటి సమస్యలను కూడా అదుపులో ఉంచుతాయి. ఇంకా నిద్రలేమి, జుట్టు రాలడం, తలనొప్పి వంటి సమస్యలను కూడా శనగలు దూరం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక కప్పు శనగలు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే శనగలను అధికంగా తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మితంగా తీసుకుంటే శనగల వల్ల శరీరానికి కలల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -