కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న వైరస్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే మరోవైపు అన్నివ్యాపార రంగాలకే కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ధియేటర్లు,చికెన్,మటన్ షాప్‌లు,స్కూల్స్,షాపింగ్ మాల్స్ అన్నింటిపై ప్రభావం చూపింది.
ఇక ముఖ్యంగా కరోనా దెబ్బకి పౌల్ట్రి రంగం కుదేలయ్యే పరిస్ధితి నెలకొంది. బ్రాయిలర్ కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందంటూ సోషల్ మీడి యా లో వస్తున్న వార్తలతో కోళ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఇక ప్రజలు అసలు చికెన్ బిర్యానీ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారులు.
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరిలో కొత్తగా ప్రారంభించిన ఒక హోటల్ లో రూ.1కే చికెన్ బిర్యానీ అమ్మటం మొదలెట్టారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రారంభించిన రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ అయిపోయింది. మొత్తంగా కరోనాతో స్టాక్ మార్కెట్ల దగ్గరి నుంచి స్మాల్ ఇండస్ట్రీలు కూడా నష్టాలబాటలో పయనిస్తున్నాయి.