- Advertisement -
చత్తీస్ గడ్ అడవులు మరోసారి నెత్తురోడాయి.కీకారణ్యం మొత్తం తుపాలకు మోతతో దద్దరిల్లిపోయింది.బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఒక్కసారిగా వారిపై దాడులు నిర్వహించాయి. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం తరలించారు.
ఎన్ కౌంటర్ అనంతరం ఆ ప్రదేశం నుంచి మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోగా ఆ ప్రదేశం నుంచి పోలీసులు కిట్ బ్యాగులు, తుపాకులు, కొంత సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
- Advertisement -