ఓటీటీలో ఛావా.. వారికి నిరాశే!

2
- Advertisement -

హిందీ చలన చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌కి కేరాఫ్‌గా మారింది ఛావా. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ – రష్మికా మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం రూ.516 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టడమే కాదు విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఛావా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే విడుదల కాగా దక్షిణాది భాషల వారికి నిరాశే ఎదురైంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ఛావాను తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. విడుదల ఆలస్యం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది.

Also Read:అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

- Advertisement -