చేయూత పథకం -వివరాలు

44
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు ప్రధాన హామీలను ప్రారంభించారు. ఈ రెండింటిలో రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం క్రింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందించే చేయూత పధకం ప్రారంభమైంది.. దీనిద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం ఎంపానల్డ్ అసుపత్రుల్లో అందుతుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శాసన సభలో చేయూత కార్యక్రమం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆరు హామీలలో భాగంగా తొలి హామీ కింద చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 10 లక్షల మేర ఆర్థిక కవరేజి తో వైద్యసాయం అందుతుంది.. దారిద్ర రేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా 1672 వైద్యపరమైన విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో పాటు 21 స్పెషాలిటీ సేవలు కూడా అనారోగ్య బాధితులకు సమకూరుతాయి.

ఈ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ పథకం లోభాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందించి తద్వారా వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా చికిత్స అందజేసేందుకు ఉద్దేశించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు.ఈ మేరకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. యోగ క్షేమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.

Also Read:ఫెర్టీ 9..బేబీ మీట్

- Advertisement -