29న ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’

5
- Advertisement -

దేవదాస్, జాన్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య ఓం, అరుణ్ రాహుల్, అంజన శ్రీనివాస్ రోహిణి ఆర్ చలపతి రాజు తదితరులు నటించిన చిత్రం చేతిలో చెయ్యేసి చెప్పు బావా . అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటో గ్రఫి మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సహనిర్మాత రేగట్టే లింగారెడ్డి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కే .జోసఫ్ మాట్లాడుతూ”ఇది ఒక వెరైటీ లవ్ స్టోరీ. అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. బండారు దానయ్య కవి గారి అద్భుతమైన పాటలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఒక మంచి సందేశం తో ప్రేక్షకులు అందరూ చూసే విధంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రాన్ని నవంబర్ 29 ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము” అని అన్నారు.

సుమన్, కవిత ,పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి ,,ఆనంద్, జయ వాణి, చిత్రo శీను, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి :ఎడిటర్ వెంకటేశ్వరరావు, డిఓపి: వేణు మురళీధర్ ,సంగీతం: పార్ధు, స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ : కె.జోసఫ్ ,స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, డైరెక్షన్ :కట్ల రాజేంద్రప్రసాద్.

Also Read:ధర్మం కోసం పోరాడుతాం: పవన్

- Advertisement -