చేతన్ చీను హీరోగా భారీ త్రిభాషా చిత్రం..

498
Chethan Cheenu - surya Kiran movie starts
- Advertisement -

‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చీను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. ‘సత్యం’ ఫేమ్ సూర్యకిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనుంది. 7స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్ గా రానుంది. మూడు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు.. మూడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించబోతుండటం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంతో చేతన్ రేంజ్ మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. దర్శకుడు సూర్యకిరణ్ చాలా కష్టపడి రాసుకున్న ఈ కథ అతనికి ‘సత్యం’కు మించిన హిట్ గా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ తో పాటు ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది.. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు..అయితే సాంకేతికంగా చిత్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్నారు.

Chethan Cheenu - surya Kiran movie starts

అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీకి కెమెరామెన్ : పిసి. కన్నా, ఎడిటింగ్ : గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్ : ‘ఘాజీ’ఫేమ్ మురళి ఎస్వి, సంగీతం : సాయికార్తీక్, స్టంట్స్ : రమణ, నిర్మాణ సారథ్యం : పరిటాల రాంబాబు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సూర్యకిరణ్.

- Advertisement -