- Advertisement -
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరుదిశగా దూసుకుపోతోంది. మ్యాచ్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయిన కోహ్లీసేన ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న పుజారా డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కొల్పోయాడు.
373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసిన పుజారా లయన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ప్రస్తుతం 134 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 433 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(53),జడేజా (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. టెస్టుల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 206 నాటౌట్. 2012, నవంబర్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు.
- Advertisement -