రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగబోయే కీలక పోరుకు ముందు, టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పంజాబ్ కింగ్స్ ఎలా ఎదుర్కోవాలో ఆయన వివరించారు.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడుతో బౌలర్లను వణికిస్తున్నాడు. అతనిని త్వరగా అవుట్ చేయడం పంజాబ్ కింగ్స్‌కు అత్యంత అవసరమని పుజారా పేర్కొన్నారు. వైభవ్‌ను కట్టడి చేయడానికి పంజాబ్ బౌలర్లు పవర్ ప్లేలో ‘షార్ట్ పిచ్’ బంతులను ఆయుధంగా వాడుకోవాలని పుజారా సూచించారు. అతనిని క్రీజులో సెట్ అవ్వనివ్వకుండా నిరంతరం ఒత్తిడిలో ఉంచాలని చెప్పారు.
అర్ష్‌దీప్ సింగ్ మరియు కగిసో రబాడ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు వైభవ్‌కు ఆరంభంలోనే సవాల్ విసరగలరని ఆయన అభిప్రాయపడ్డారు.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్ కింగ్స్‌కు ఈ విజయం చాలా ముఖ్యం. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.
యంగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ వికెట్ ఈ మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేయగలదని, అందుకే పంజాబ్ కింగ్స్ అతని కోసం ప్రత్యేక వ్యూహంతో సిద్ధమవ్వాలని పుజారా విశ్లేషించారు. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:IPL:ఎలైట్ క్లబ్‌లోకి ఆర్సీబీ

