- Advertisement -
టీఆర్ఎస్ నేత,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య కుటుంబసభ్యులు,టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకుల సమక్షంలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. కడసారిగా తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది ప్రజలు తరలివచ్చారు.మాజీ మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి,మదన్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.
వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన ముత్యంరెడ్డి అంచెలంచెలుగా రాష్ట్రస్ధాయి నేతగా ఎదిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా,టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1970లో తొగుట సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై 17 ఏండ్లు సర్పంచ్‌గా పనిచేశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
- Advertisement -