చెర్రి తండ్రయ్యాడా..?

174
cherry-father-no-not-yet

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఖైదితో రీఎంట్రీ ఇస్తే మెగాఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. అదే విధంగా మెగా ఫ్యాన్స్‌కి మరో పండుగ చేసుకునే వార్త ఒకటి హాల్‌చల్‌ చేస్తోంది. అదెంటంటే మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు సమాచారం. చెర్రీ-ఉపాసనా ప్రేమించి పెళ్లి చేసుకుని జరిగి ఐదేళ్లు గడిచిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా చరణ్, ఉపాసనాలను వెంటాడుతున్న ప్రశ్న పిల్లలు గురించి ఏం అనుకుంటున్నారు? అని.. ఇన్నాళ్లుగా ఆ ప్రశ్నకు జవాబు దాటవేస్తూ వస్తోన్న ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఉపాసన గర్భం దాల్చిందని తెలుస్తోంది.

upasanacharan-18-1463545655

ఇక తమకంటూ ప్రత్యేకంగా ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నామని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్, ఉపాసన త్వరలోనే వేరే కాపురం పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు తమ కుటుంబంలోకి వారసుడిని తీసుకురావాలని ఈ జంట నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసిన మెగాభిమానులు తమ బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంగతి తెలిసిన మెగా ఫ్యామిలీ సన్నిహితులు రూమర్లుగా చెబుతున్నారు.  ఏది ఎలా ఉన్న ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ram-charan-upasana-special-prayers.566a5bb9a62f9_730x410