తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నేడు జర్నలిస్టులకు అపన్నహస్తం కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొని చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్ట్ లను ఆదుకునే అడ్డా. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ఇక్కడి లాగా ఇతర రాష్ట్రాల్లో నిధులు లేవు. సీఎం కేసీఆర్ జర్నలిస్ట్ సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు.అని నారాయణ అన్నారు.
ఇప్పటి వరకు 224 మంది చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాము. లివర్ డ్యామేజ్,హార్ట్ ఎటాక్, బ్రెయిన్ డెడ్ లతో జర్నలిస్ట్ చాలా మంది చనిపోతున్నారు. జర్నలిస్ట్ లకు వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటాయి. ఎవరయినా జర్నలిస్ట్ లు ఆక్సిడెంట్‌లో చనిపోతే 5లక్షలు ప్రెస్ అకాడమీ ఇస్తోంది. 34 డెత్ కేసులు,6 ఆక్సిడెంట్ జర్నలిస్ట్ లకు,వారి కుటుంబాలకు, చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు.
చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయలు, ఆక్సిడెంట్‌లో గాయపడిన వారికి 50 వేలు ఇచ్చాము. ప్రమాదాల్లో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 3 వేలు పింఛన్ ఇస్తున్నాం. ఇప్పటివరకు 5 కోట్లు జర్నలిస్ట్ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. జర్నలిస్టు లందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.