రష్మిక వదిలిన ‘మహాసముద్రం’ మెలోడీ.. వీడియో

29
Maha Samudram

టాలీవుడ్‌ హీరోలు శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ మల్టీసారర్‌ ‘మ‌హాస‌ముద్రం’ మూవీ తెరకెక్కుతోంది. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న్నారు. ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని క‌లిగిస్తోంది. ఆగ‌స్ట్ 19న విడుద‌ల ప్రేక్షకుల ముందుకు రానున్న‌ది.

ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌ రష్మిక మందన్న చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించారు. “చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు .. ” అంటూ ఈ పాట సాగుతోంది. ప్రేమలో పడిన ఒక యువతి మనసు చేసే అల్లరి ఈ పాట .. అతనితో అందమైన జీవితాన్ని ఊహిస్తూ ఉత్సాహంతో పాడుకునే పాట. తేలికైన పదాలతో చైతన్యప్రసాద్ అందించిన సాహిత్యం బాగుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. దీప్తి పార్థసారథి ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. పాటకు … పాటకి సంబంధించిన మేకింగ్ షాట్స్ ను జోడిస్తూ అందించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

Maha Samudram - Cheppake Cheppake Lyrical | Sharwanand | Siddharth | Chaitan Bharadwaj, AjayBhupathi