టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..

49
IPL 2022
- Advertisement -

ఐపీఎల్‌ 2022 సీజన్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక, శివమ్ దూబే స్థానంలో రాయుడు తిరిగి జట్టులో చేరాడు. ఇక, రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ న్యూస్. జేమ్స్ నీషమ్ స్థానంలో షిమ్రోన్ హెట్మేయర్ తిరిగి జట్టులో చేరాడు.

రాజస్థాన్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ప్లేఆఫ్స్ చేరకుండానే మరోసారి ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఇవ్వాళ్టి మ్యాచ్ నామమాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే పాయింట్లు డబుల్ డిజిట్‌కు చేరుతాయి. 10 పాయింట్లతో సీజన్‌కు గడ్‌బై చెప్పే వీలు ఉంటుంది.

తుది జట్లు :

చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, ఎన్ జగదీశన్, అంబటి రాయుడు, మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ – వికెట్ కీపర్), ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి, మతీష పతిరణ.

రాజస్థాన్ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కే

- Advertisement -