హోమ్ గ్రౌండ్‌లో చెన్నై మరోసారి సత్తా చాటింది. చివరిబంతి వరకు ఉత్కంఠబరితంగా సాగిన పోరులో రాజస్థాన్‌పై చెన్నై విజయం సాధించింది. ధోనికి అంబటి రాయుడు అద్భుత సహకారం అందించగా కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకున్నాడు మహి. చివరి ఓవర్‌లో హైడ్రామా నెలకొన్నా శాంట్నర్ ఆఖరి బంతికి సిక్సర్‌తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నైకి ఆరంభంలోనే గట్టిషాక్ తగిలింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.ఈదశలో క్రీజులో వచ్చిన ధోని,రాయుడు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.కెప్టెన్ ధోని (58; 43 బంతుల్లో 2×4, 3×6), రాయుడు (57; 47 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో జట్టును విజయతీరాలకు దగ్గరగా చేర్చారు. చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి రాగా.. ధోని ఔట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ.. కానీ శాంట్నర్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి చెన్నైకి సంచలన విజయం అందించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రహానె (14), బట్లర్ (23),శాంసన్ (6),స్మిత్ (15), త్రిపాఠి (10) ,యస్ గోపాల్ (19 నాటౌట్) పరుగులు చేశారు. జడేజా (2/20), శార్దూల్ ఠాకూర్ (2/44), చాహర్ (2/33) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. దీంతో సూపర్‌కింగ్స్ విజయాల హ్యాట్రిక్ కొట్టింది.