చెన్నై చిన్నోడుకు రెస్పాన్స్ అదుర్స్..

232
- Advertisement -

జి.వి ప్రకాష్‌ కుమార్ హీరోగా న‌టిస్తూ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఓ త‌మిళ చిత్రాన్ని `చెన్నై చిన్నోడు` (వీడి ల‌వ్‌లో అన్నీ చిక్కులే ట్యాగ్‌లైన్‌) పేరుతో శూలిని దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువ‌దిస్తున్నారు వి.జ‌యంత్ కుమార్‌. నిక్కీ గల్రానీ , ర‌క్షిత హీరోయిన్లుగా న‌టించారు. హీరో జీవా గెస్ట్ రోల్ లో క‌నిపించ‌గా, విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అల‌రించ‌నున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రంలోని పాట‌లు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ లో, ఎఫ్ ఎమ్ రేడియోల్లో పాట‌లు మారు మోగుతున్నాయి. ఆడియో తో పాటు విడుద‌లైన ట్రైల‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ `చెన్నై చిన్నోడు` చిత్రంలోని పాట‌ల‌కు, ట్రైల‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ తో బిజినెస్ ప‌రంగా కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

chennai chinnodu updates

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ మాట్లాడుతూ…‘‘ జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం స‌మ‌కూరుస్తూ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రాన్ని తెలుగులో `చెన్నై చిన్నోడు` పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నాం. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా తెలుగు నేటివిటీకి తగ్గ‌ట్టుగా అనువాద కార్య‌క్ర‌మాలు చేశాం. జి.వి.ప్ర‌కాష్ కుమార్ అద్భ‌త‌మైన న‌ట‌న‌తో పాటు సంగీతం కూడా స‌మ‌కూర్చారు. పూర్ణ‌చారి గారు చ‌క్క‌టి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు రెస్పాన్స్ బాగుంది. చాలా యూత్ ఫుల్ గా పాట‌లు, ట్రైల‌ర్ ఉన్నాయంటున్నారు. ఇప్ప‌టికే బిజినెస్ ప‌రంగా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మేము అనుకున్న దానికన్నా బిజెనెస్ రెస్పాన్స్ బాగా వ‌స్తోంది.
యూత్ ఫుల్ ల‌వ్ తో పాటు క‌బుపుబ్బ నవ్వించే కామెడీ ఇందులో ఉంటుంది. ప్రకాష్‌ రాజు గారి పోలీస్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుంది. అలాగే హీరో జీవా గారు గెస్ట్ రోల్ లో క‌నిపిస్తారు. అతి త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

హీరో జీవా (గెస్ట్ రోల్‌) , ప్ర‌కాష్ రాజ్‌, బాలాజీ, ఊర్వ‌శి, జీవ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లుః వెలిదెండ్ల రాంమూర్తి, పాట‌లుః సి.హెచ్‌ పూర్ణాచారి, సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్‌.కృష్ణ, నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ (బి.టెక్‌). ద‌ర్శ‌కత్వంః ఎం.రాజేష్‌.

- Advertisement -