రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై….

306
- Advertisement -

ఐపీఎల్‌-11 సీజన్‌లో రెండో సెంచరీ నమోదైంది. క్రిస్ గేల్ మెరుపులు మర్చిపోక ముందే చెన్నై ఆటగాడు వాట్సాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెంచరీతో రాణించి చెన్నైకి భారీ విజయాన్ని అందించాడు. రాజస్ధాన్‌ హోం గ్రౌండ్ పుణెలో ఆ జట్టును చిత్తుగా ఓడించింది. వాట్సన్‌ రాణించడంతో చెన్నై 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది .

205 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కొత్తగా జట్టులోకి వచ్చిన దక్షిణాఫ్రికా నయా సంచలనం క్లాసన్‌ (7) తన ప్రత్యేకత చూపించలేకపోయాడు. సంజు శాంసన్‌ (2) ,రహానె (16) కూడా ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. దీంతో రాజస్థాన్ తీవ్ర కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్‌ జోడీ స్టోక్స్‌ (45; 37 బంతుల్లో 3×4, 1×6), బట్లర్‌ (22) కాస్త ఆశలు రేపినా.. ఈ భాగస్వామ్యం విడిపోగానే రాయల్స్‌ ఓటమి ఖరారైపోయింది. చెన్నై బౌలర్లలో శార్దూల్‌తో పాటు బ్రావో (2/16), వాట్సన్‌ (1/13), కర్ణ్‌ శర్మ (2/13), చాహర్‌ (2/30) మెరిశారు.

chennai beats rajasthan

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి వాట్సన్‌ అదిరే ఆరంభాన్నిచ్చాడు. 57 బాల్స్ లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి రాజస్ధాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వాట్సన్‌కు తోడుగా రైనా …29 బాల్స్ లోనే 9 ఫోర్లతో 46 రన్స్ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 204 పరుగులకు చేసింది. బ్యాటింగ్‌,బౌలింగ్‌లో రాణించిన వాట్సనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. రాజస్థాన్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి.

- Advertisement -