ఇందిరా పార్కు వద్ద నేతన్నల ధర్నా

35
- Advertisement -

రాష్ట్రంలో పవర్ లూమ్ మరియు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి , ఉపాధి కల్పించాలని ఇందిరా పార్కు లో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక (JAC) ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎం.ఎల్.ఏ కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు….

కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని సిరిసిల్ల కార్మికుడు ఆరోపించారు. ఎందుకు బతుకమ్మ చీరల ఆర్డర్ లను ఆపి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు మోయాలైనాయి….అందుకే ధర్నా ద్వారా మా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అన్నారు.

30 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది…ఇప్పటికే 14 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గత పదేళ్లలో ఎలాంటి ఇబ్బంది లేదు…కానీ ఇప్పుడు అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Also Read:Harishrao: కాంగ్రెస్ అంటేనే ధోకా, 8 నెలల్లో ఎన్ని ధోకాలో తెలుసా?

- Advertisement -