చెమట పొక్కులకు చెక్ పెట్టండిలా..!

139
- Advertisement -

వేసవి వచ్చిందంటే చర్మ సమస్యలు ఎక్కువగా వేదిస్తూ ఉంటాయి. విపరీతమైన వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు, చెమట పొక్కులు, వేడి కాయలు వంటివి ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్యలు అధికం. బయటి ఉష్ణోగ్రత అలాగే, శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వల్ల.. చర్మంపై పొక్కులు, దద్దుర్లు పెరిగి తీవ్రమైన దురద మంటకు దారితీస్తాయి. అంతే కాకుండా వేడి కారణంగా చెమట పెరిగి చర్మంపై ఉన్న మట్టి, దుమ్ము, ధూళి పెరుకుపోయి ఎంతో అలెర్జీని కలుగజేసి చర్మ సమస్యకు దారి తీస్తాయి. కాగా వేసవిలో సాధారణంగా వేధించే చెమట పొక్కులు, దద్దుర్లు వంటి చర్మ సమస్యల నుంచి తాప్పించుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల సన్ లోషన్స్, కూలింగ్ పౌడర్స్ వంటివి వాడుతుంటాము. అయితే వీటిని తగ్గించుకోవడానికి సహజ సిద్దంగానే చక్కటి పరిష్కారాలు ఉన్నాయి అవేంటో చూద్దాం !

ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ ల చేసుకొని చర్మంపై ఏర్పడిన పొక్కులపై అప్లై చేసి 5 నుంచి 10 నిముషాల తరువాత చన్నీటి స్నానం చేయాలి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల చర్మంపై ఏర్పడే పొక్కులు దద్దుర్లు తగ్గిపోతాయి. అలాగే ఐస్ ముక్కలను ఒక బట్టలో గాని లేదా ప్లాస్టిక్ కవర్ లో గాని వేసి వాటితో చెమట కాయలకు కాపడం పెట్టడం వాళ్ళకు కూడా ఈ సమస్యలు తగ్గుతాయి. ఇక మరో చిట్కా ఏమిటంటే..గంధం పొడి, రోజ్ వాటర్, పెరుగు కలిపిన మిశ్రమాన్ని చెమట పొక్కులపై అప్లై చేసి పది నిముషాల తరువాత కడగాలి. ఇక ప్రతిరోజూ చేయడం వల్ల కూడా చర్మ సమస్యలు దూరం అవుతాయి.

పై చిట్కాలు మాత్రమే కాకుండా ప్రతి రోజు రెండు సార్లు చన్నీటి స్నానం చేయడం, వేడి కలిగించే పదార్థాలకు దూరంగా ఉండడం, శరీర వేడిని తగ్గించే పండ్లు తినడం వంటివి చేయడం వల్ల కూడా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.

Also Read:కాంగ్రెస్ వ్యూహకర్తపై వీహెచ్‌ సంచలన కామెంట్స్

- Advertisement -